తల్లి మేకప్ పై కొడుకు ఎమోషనల్..అసలు మ్యాటరేంటంటే?

-

ఈరోజుల్లో ఆడవాళ్లకు అందం పై ఎంత శ్రద్ద వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మేకప్ లేకుండా మొగుడికి మొహం కూడా చూపించరు.అందంగా కనిపించడం కోసం అడ్డమైన వన్నీ పూస్తారు..చివరికి ఏదొక రోగం వస్తే లబోదిబోమంటున్నారు.గ్లామర్‌ మేకప్‌తో కూడిన ఫేక్ ఐ లాషెస్ అనేది ఇటీవలి మేకప్ ట్రెండ్.. ఇది చూసిన చాలా మంది వ్యక్తులు నిజమని భావిస్తారు.ఇకపోతే ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..

అందులో తన తల్లి తన కనురెప్పల ద్వారా తనను తాను గాయపరుచుకుంటుందని భావించిన ఒక చిన్న పిల్లవాడు వద్దు మమ్మీ అంటూ బోరున ఏడ్చేస్తున్నాడు.. హృదయాన్ని కదిలించే ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 2.6 మిలియన్లకు పైగా వీక్షణలతో రీల్ వైరల్ అయింది. మీ బిడ్డ అక్కడ ఏ మాత్రం బాధ, నొప్పి లేని విషయం మీద బాధను అనుభవిస్తున్నాడు. దీనినే స్వచ్ఛమైన ప్రేమ అంటారు..నా బిడ్డ కూడా అలానే భావించారు అంటూ ఆ తల్లి వీడియోకు క్యాప్షన్‌ కూడా ఇచ్చారు..

ఈవెంట్ నుండి ఇంటికి వచ్చి తన మేకప్ తీసేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె తన నకిలీ కనురెప్పలను బయటకు తీయడం ప్రారంభించినప్పుడు.. ఆమె కొడుకు తన తల్లి తన నిజమైన వెంట్రుకలను పీకేసుకుంటుందని భావిస్తాడు..ఆమె కనురెప్పలను లాగేస్తుండటం స్పష్టంగా కనిపిస్తుంది. అది చూసిన పిల్లవాడు..వద్దు మమ్మీ..వద్దు వద్దు అంటూ..కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అలా చెయ్యొద్దు అమ్మ అంటూ..తల్లి రెండు చేతులను పట్టుకుని ఆపుతున్నాడు. అయినప్పటికీ అతని తల్లి పెట్టుకున్న నకిలీ ఐ లాషెస్‌ని తీసివేసింది..ఏదో అవుతుందని భావించిన కొడుకు ఆమె కోసం ఏడవటం చూసి ఆ తల్లి పిల్లవాడిని దగ్గరకు తీసుకుని హత్తుకుంది.. ఆ వీడియోను చూసిన వారంతా కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version