సూపర్..చిన్న సీసాలో పెద్ద ప్రపంచం..చూశారా?

-

మనుషులు ఎన్నో అద్బుతమైన కళాకృతులను బయట ప్రపంచానికి చూపిస్తున్నారు. అందులో కొన్ని మాత్రం జనలాను ఔరా అనిపిస్తున్నాయి. కళ్ళతో చూసి కూడా నమ్మలేకపోతున్నారు.అతి చిన్న వస్తువులలో పెద్ద ప్రపంచాన్ని చూపిస్తున్నారు.చిన్న బియ్యపు గింజ పై ఎంతో అలవోకగా పేర్లను రాస్తున్నారు.అలాగే ఇప్పుడు మరో వింత జరిగింది.ఓ వ్యక్తి అదిరిపోయే పెయింటింగ్ వేశాడు.

ఎంతో మంది చరిత్రకారులు తమ పెయింటింగ్ తో అద్బుతాలు సృష్టించారు. చాలా తక్కువ మంది పెయింటింగ్ ఆర్టిస్ట్ లకు ఈ ఘనత దక్కుతుంది. కొంతమంది అతి సూక్ష్మంగా బొమ్మలు వేసి ఆకట్టుకుంటారు. ఒక పెయింటింగ్ ఎన్నో అర్థాలను చెపుతుంది. అది చూసే విధానం బట్టి ఉంటుంది. ఒక్కో చిత్రంలో ఒక లైఫ్ కనబడుతుంది. అందుకే రాజా రవి వర్మ పెయింటింగ్స్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి.

కొన్ని పెయింటింగ్ లో అమ్మ ప్రేమ.. పల్లెటూరి వాతావరణం కనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటు పోతే పెయింటింగ్ కు హద్దులు లేవు..అతనికి అలుపు లేదు..చిన్న వేలు కూడా దూరని సిసాలో అద్బుతమైన పెయింటింగ్ వేస్తూ ప్రకృతిని మొత్తం అందులోనే చూపించాడు ఓ పెయింటర్. చిన్న నెయిల్ పాలీష్ లాంటి గాజు సీసాలో చిన్న బ్రష్ తో అద్బుతాన్ని ఆవిష్కరించాడు. ఆ చిన్న సీసాలో సెలయేరు, చెట్లు, అందమైన ఇల్లు ఇలా ప్రకృతి మొత్తం అందులో బందించాడు..అతని టాలెంట్ ను చూసిన ప్రతి ఒక్కరూ అభినందించారు..ఆ పెయింటింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..మీరు ఆ అద్భుతమైన పెయింటింగ్ను ఒకసారి చూడండి..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version