ఎందుకు సోప్‌ ప్యాక్‌లపై అమ్మాయిల ఫోటోలే ఉంటాయి..? అబ్బాయిలు కూడా స్నానం చేస్తారుగా

-

వినియోగదారులకు తమ ప్రొడెక్ట్స్‌ను దగ్గర చేసేందుకు ప్రకటనలు చాలా కీ రోల్‌ ప్లే చేస్తాయి. మీరు ఒకటి గమనించారా..? మనం ఏదైనా సబ్బు ప్రకటన లేదా సబ్బు ప్యాకెట్ చూసినప్పుడల్లా అందులో స్త్రీ ఫొటోనే ఉంటుంది. పురుషులు ఫొటోలు చాలా అరుదుగా ఉంటాయి. అంటే లేడీస్‌ పిక్‌ ఉంటే ఆ సబ్బులు కేవలం అమ్మాయిలే వాడతారా..? ఎందుకు ఇలా..?

మార్కెట్‌లో చాలా రకాల సబ్బులు అందుబాటులో ఉన్నాయి. సంతూర్, ప్రియా, డైనా, ఇలా చాలా సోప్‌ ప్యాక్‌లపై అమ్మాయిల బొమ్మ ఉంటుంది. సబ్బు కవర్ మీద, ప్రకటనలో అమ్మాయిల ఫోటోలు ఎందుకు ఉంటాయి. పురుషులు కూడా స్నానం చేస్తారు కదా అనే డౌట్‌ మీకు ఎప్పుడైనా వచ్చిందా..?

మీరు గూగుల్‌లో ఇలాంటి ప్రశ్న అడిగితే, దానికి గూగుల్ ఫన్నీగా సమాధానం ఇస్తుంది. అంటే పురుషులతో పోలిస్తే స్త్రీలు రోజూ స్నానం చేస్తారు కాబట్టే అలా ఫోటో పెడతారా..? రోజూ స్నానం చేసే మగవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని, అందుకే సబ్బు కవర్ పై ఎక్కువగా మహిళల ఫొటోలు ఉంటాయని కొందరు పెడతారు.

సబ్బు ప్యాకెట్లలో మహిళల ఫోటోలు, సబ్బు ప్రకటనలు మహిళలను కలిగి ఉండటానికి మార్కెటింగ్ ప్రధాన కారణం. మహిళల ఫోటో ఉంటేనే ప్రకటన ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సబ్బుల ప్రకటనల్లో మహిళలు మాత్రమే కనిపిస్తారు. షీ లుక్‌ కోసం ఇలా చేస్తారు. న్యూస్‌ పేపర్లో కూడా.. ఫ్రెంట్‌ పేజ్‌లో ఎక్కువగా అమ్మాయిల బొమ్మలే ఉంటాయి. అది కూడా షీ లుక్‌ కోసం చేస్తారు. డిజిటల్‌ మార్కెట్‌లో షీ లుక్‌ అనేది చాలా ముఖ్యం. అందుకే ఈ ట్రిక్‌ ప్లే చేస్తుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version