తలపై దోమలు ఎందుకు తిరుగుతాయో చెప్పేసిన తాజా పరిశోధనలు

-

ఏదైనా పార్క్ కు లేదా, దోమలు ఎక్కువ ఉన్న ప్రదేశంలో సాయంత్రం వేళ..కేవలం తలపైనే దోమలు తిరుగుతాయి. ఇలా తలమీద రౌండ్ గాఈ దోమలు ఎందుకు తిరుగుతాయ్ అని కూడా మనం పెద్దగా పట్టించుకోం. వాటిని ఎలా అయినా తలమీద వాలకుండా చేయలాని ట్రై చేస్తాం కానీ అవి పోవు. తలపై తిరిగే దోమలు కుట్టవని సైన్స్ చెబుతోంది. కుట్టనప్పుడు అవి తలపై ఎందుకు తిరుగుతాయనేది పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.

దోమల మీద చేసిన పరిశోధన ప్రకారం మనుషులు కార్బన్-డై-ఆక్సైడ్ వాయువును విడుదల చేస్తారు. ఈ CO2కి దోమలు ఆకర్షితులవుతాయి. ఈ కార్బన్ డై ఆక్సైడ్ సహాయంతో దోమలు 10 మీటర్ల దూరం నుంచే మనుషులు ఉన్నారని గుర్తిస్తాయట. మనిషి వద్దకు చేరగానే ఆడ దోమలు మనిషిని కుట్టడం ప్రారంభిస్తాయి. మగ దోమలు ఇలా తలమీద తాండవం చేస్తాయి. మనిషి శరీరంలోని వేడి కారణంగా దోమలు వెంట్రుకల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతాయని కూడా ఓ పరిశోధన చెబుతోంది.

చెమట కూడా ఒక కారణం

సైన్స్ ABC యొక్క నివేదిక ప్రకారం.. దోమలు తలపైకి రావడానికి చెమట కూడా ఒక ప్రధాన కారణం అని తేలింది.. పరుగున వచ్చి, వ్యాయామం చేసి బయటకు వెళ్లి, ఏదైనా శారీరక శ్రమ చేసినట్లయితే తలపై చెమట ఎక్కువగా ఏర్పడుతుంది. జుట్టు కారణంగా ఈ చెమట చాలా కాలం పాటు అలానే ఉంటుంది. ఈ చెమటలో ఉండే.. ఆక్టానాల్ రసాయనానికి.. దోమలు ఆకర్షితులవుతాయి. ఫలితంగా అవి తలపై వాలడం ప్రారంభిస్తాయి.

రక్తం తాగని మగ దోమలు మనుషుల వద్దకు ఎందుకు వెళ్తాయి?

మగ దోమలు మనుషులను కుట్టవని.. అయినప్పటికీ మనుషుల వద్దకే వెళ్తాయని జర్నల్ ఆఫ్ మెడికల్ ఎంటమాలజీలో ప్రచురితమైన పరిశోధనలో తేలింది. దోమలు మనుషులను కుట్టేందుకు చుట్టూ తిరుగుతాయి. ఆడ దోమలను వెతుక్కుంటూ మగ దోమలు అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. భలే గమ్మత్తుగా ఉంది కదూ..దోమల్లో కూడా..ఆడ దోమలు వెనుక మగ దోమలు వెళ్లాతాయట. అయితే కచ్చితమైన సమాచారం కోసం దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version