ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే అస్సలు చెయ్యరు..

-

ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా..అయితే ఈ మధ్య వెలుగులోకి వస్తున్న వాటిని చూస్తె ఇక ఆర్డర్ చెయ్యరు..కొద్ది రోజుల క్రితం సుమిత్ అనే వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. కాఫీ కోసం జొమాటోలో ఆర్డర్ చేయగా.. చికెన్ ముక్క ఉన్న కాఫీ అతడికి డెలివరీ అయిన విషయం తెలిసిందే..అంతకు ముందు చికెన్ లో రబ్బరు ముక్కలు వచ్చాయి..ఇప్పుడు ఏకంగా ఆర్డర్ చేసిన ఫుడ్ కు బదులు పచ్చి కూరగాయలు వచ్చాయి..ఇలాంటి తప్పులు వల్ల ఫుడ్ ఆర్డర్ లకు డిమాండ్ థగ్గిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి..

 

అసలు విషయానికొస్తే.. ఢిల్లీకి చెందిన ఉబైడు అనే యువకుడికి ఆనియన్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. వాటిని తినాలనిపించిన ప్రతిసారి.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకునేవాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే.. తాజాగా ఫుడ్‌ డెలివరీ యాప్‌లో ఆరు ఆనియన్ రింగ్ పీసులు కావాలని ఆర్డర్ పెట్టాడు. కొద్ది నిమిషాల తర్వాత డెలివరీ బాయ్.. ఫుడ్ పార్శల్ తెచ్చిచాడు. ఆ తర్వాత తనకు ఎంతో ఇష్టమైన ఆనియన్ రింగ్స్‌ తినేందుకు పార్శల్‌ను ఓపెన్ చేశాడు.

ఈ క్రమంలో.. ఆ పార్శల్‌లో ఆనియన్ రింగ్స్ బదులుగా పచ్చి ఆనియన్ ముక్కలు ఉండటంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. అనంతరం తాను ఎదుర్కొన్న చేదు అనుభాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలో వెల్లడించాడు. అతడు చేసిన పోస్ట్ వైరల్ కావడంతో.. నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. ‘పచ్చి ఆనియన్ ముక్కలతోపాటు, బేషన్, ఆయిల్ కూడా పంపిచారేమో కవర్‌లో సరిగా చూడండి’ అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు..మొత్తానికి ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది..అందుకే ఏదైనా ఆర్డర్ చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version