ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతున్నారా?ఇది ఒకసారి చూడండి..

-

టెక్నాలజీ వాడకం రోజు రోజుకు పెరిగిపోతుంది.. మనుషులకు బద్ధకం కూడా పెరిగింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువగా వాడుతున్నారు.వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లును వాడుతున్నారు.ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ వల్ల కొన్ని పనులు వేగంగా జరుగుతూ ఉన్నా, ప్రజలకు స్మార్ట్ ఫోన్ వల్ల చాలా నష్టాలు కూడా జరుగుతూ ఉన్నాయి..స్మార్ట్ ఫోన్ ఎంతవరకు ఉపయోగిస్తున్నారంటే దాదాపు 6 నెలల చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు స్మార్ట్ ఫోన్ లేకుండా నిమిషం కూడా ఉండలేక పోతున్నారు. ఈ ఫోన్ల వల్ల పిల్లలలో చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే, ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. సెల్ ఫోన్ ను మితిమీరి వాడడం వల్ల చర్మం దెబ్బతింటుందట. సెల్ ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడడం వల్ల మొటిమలు, అలర్జీలు, చర్మం పై ముడతలు, నల్ల మచ్చలు, కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.మొబైల్ పై సూక్ష్మ క్రిములు పేరుకుపోయి ఉండడం వల్ల చర్మంపై మొటిమలు వస్తాయి. ముఖానికి దగ్గరగా పెట్టుకుని మాట్లాడడం వల్ల ముఖానికి ఉన్న మేకప్, రాసుకున్న క్రీమ్, చెమట వంటివి స్మార్ట్ ఫోన్ స్క్రీన్ కు అంటుకుంటాయి..

ఇకపోతే కొంతమందికి ఫోన్ ను బాత్ రూమ్ లోకి తీసుకువెళ్లే అలవాటు కూడా ఉంటుంది. అలా మొబైల్ పై ఎక్కువ సూక్ష్మ క్రిములు చేరే ప్రమాదం ఉంది. ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే తరచూ మొబైల్ ఫోన్ ను శుభ్రం చేస్తూ ఉండాలి. 40 శాతం ఆల్కహాల్ ఉన్న ద్రవ రూపంలోని క్లీనర్స్ తో మొబైల్ ను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇయర్ ఫోన్స్ ను వాడితే మంచిది. మొబైల్ వాడడం వల్ల చెంపలపై దద్దుర్లు, అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ల స్క్రీన్ లపై నికెల్, క్రోమియంలు ఉంటాయి..అందుకే ఫోన్ ను ఎంతవరకు వాడాలో అంతవరకూ మాత్రమే వాడటం మంచిదని నిపుణులు అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version