అరె ఏంట్రా ఇది..టపాసులతో ఇలా ఎవరైనా చేస్తారా?

-

దీపావళికి అందరూ టపాసులు కాలుస్తారు..చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాలుస్తూ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కొంతమంది మాత్రం డిఫరెంట్ గా ఆలోచిస్తారు.అదే పిచ్చితో కొత్తగా చేస్తారు..అందరితో చివాట్లు తింటారు.ఎంజాయ్ చేయడం కోసమో చిలిపి పనులు చేస్తూ ఉంటారు. అలా చేస్తే ఎంతో నష్టం అని తెలిసినా.. కావాలని పనిగట్టుకుని తుంటరి పనులు చేస్తుంటారు. కాని దీపావళిలో బాణాసంచా కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి.

ఎక్స్ ట్రాలు చేస్తే ఎంతో ప్రమాదం కూడా. ఎన్ని తుంటరి పనులు చేసినా బాణాసంచా కాల్చే విషయంలో మాత్రం తుంటరి వేషాలు వేస్తే పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇంట్లో పెద్దవాళ్లు కూడా బాణాసంచా కాల్చేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు సూచిస్తారు. చిన్న పిల్లలు అయితే పేరెంట్స్ దగ్గరుండి బాణాసంచా కాల్పిస్తారు. సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం ఓ వ్యక్తి చేసిన పని వైరల్ అవుతుంది..దీపావళి సందర్భంగా ఓ యూట్యూబర్‌ కొత్తగా ఆలోచించాడు. అందరిలా మామూలుగా బాణాసంచా కాలిస్తే వెరైటీ ఏముందిలే అనుకున్నాడో ఏమో.. కొంత డిఫరెంట్‌గా థింక్‌ చేశాడు.

రాజస్తాన్‌లోని అల్వార్‌కు చెందిన యూట్యూబర్‌ అమిత్‌ శర్మ.. కొత్తగా ఏం చేద్దామా అని ఆలోచించి.. ఓ కారును టార్గెట్‌ చేశాడు. దీపావళి సందర్భంగా ఆ కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. కారు చుట్టూ లక్ష టపాసులను వరసగా పేర్చాడు. కారు ముందున్న గ్లాస్‌పై మాత్రం టపాసులు పెట్టలేదు. అనంతరం అంకెలు లెక్కపెడుతూ.. రెడీ అని కారుపై పేర్చిన బాంబులను పేల్చాడు..బాంబులు పేలడంతో కారు కలర్‌ మొత్తం మారిపోయింది. కారు లోపల పొగ నిండిపోయి ఉంది.

కారు అద్దంపై బాంబులు లేకపోయినప్పటికీ పేలిన టపాసుల ధాటికి గ్లాస్‌ పగిలిపోయింది. కానీ, ఇన్ని బాంబులు పేలినా కారు ఇంజన్‌ మాత్రం పనిచేయడం గమనర్హం. కొద్దిసేపటి తర్వాత యూట్యూబర్‌ మళ్లీ కారును స్టార్ట్‌ చేసి డ్రైవింగ్‌ చేస్తూ తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్‌ చేశాడు..ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.. మీరు ఆ వీడియోను చూడండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version