వైవాహిక జీవితంలో సమస్యలు చాలా కామన్ గా వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. అయితే ఒక్కొక్క సారి భార్యా భర్తల మధ్య పెద్ద పెద్ద గొడవలు వచ్చి విడిపోవాలని అనుకుంటూ ఉంటారు అయినప్పటికీ విడిపోకుండా కలిసి ఉంటారు. అయితే పెద్ద పెద్ద గొడవలు వస్తున్నా పదే పదే సమస్యలు వస్తున్నా ఎందుకు భార్యా భర్తలు కలిసి ఉంటారు..? దాని వెనుక కారణమేమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
చిన్న వాటిగా చూడడం:
చాలా మంది భార్యా భర్తలు గొడవ అయిన తర్వాత దానిని చిన్నదిగా భావిస్తారు అవే సర్దుకుపోతాయని పాజిటివ్ గా ఉంటారు. పెద్ద పెద్ద సమస్యలను కూడా పరిష్కరించుకోకుండా చిన్నవిగా చూస్తారు దీంతో మళ్ళీ కలిసి ఉండాలని అనుకుంటారు.
బంధం లో ఉండే సామర్థ్యాన్ని చూడడం:
చీటికీమాటికీ వచ్చే గొడవలని చూడకుండా చాలామంది బంధం లో ఉండే సామర్థ్యాన్ని చూస్తారు దీనితో మళ్ళీ కలిసి ఉండాలని భావిస్తారు.
ఆశించడం:
మా బంధం ఇకనుండి బాగుంటుంది పోనీలే జరిగినవి ఏవో జరిగిపోయాయి అని చాలామంది ఆశ పడుతూ ఉంటారు. ఈ కారణంగా కూడా పదేపదే గొడవలు వస్తున్నా కలిసి జీవిస్తారు.
విశ్వాసం ఉండడం:
ఇతరుల కంటే కూడా నా జీవితం బాగానే ఉంది మంచి మనిషి దొరికాడు అని చాలామంది భావిస్తారు. అందుకే భార్యాభర్తలు కలిసే ఉంటారు.
మార్పు వస్తుందని చూడడం:
మార్పు వస్తుందేమో ఏదో ఒక రోజు మారతాడేమో మారుతుందేమో అని చాలామంది భార్య భర్తలు భావించి కలిసే ఉంటారు.