భాగ్యనగరంలో పెరుగుతున్న ఆ సర్జరీలు.. జాబ్‌ చేసే మహిళలే ఎక్కువ..!!  

-

ఈరోజుల్లో..అందం, ఆరోగ్యం మీద ప్రజలకు శ్రద్ధ పెరిగింది.. కరోనా వల్ల ఆరోగ్యంపై జాగ్రత్త వహిస్తుంటే.. సోషల్‌ మీడియా ప్రభావం, రీల్స్‌, ఫోటోల వల్ల అందంపై అటు అమ్మాయిలకు, ఇటు అబ్బాయిలకు ఇంట్రస్ట్‌ పెరిగింది. ఇంతకు ముందు.. తెల్లగా ఉంటే చాల్లే అనుకునేవారు..కానీ ఇప్పుడు బాడీలో కనిపించే ప్రతీపార్టు కరెక్ట్‌ షేప్‌లో ఉండాలి అనుకుంటున్నారు. ఒకవేళ అలా లేదంటే.. ఏం చేస్తాం దేవుడు అలా ఇచ్చాడు అనుకోవడం లేదు..టెక్నాలజీ సాయంతో ఆపరేషన్లకు సైతం సై అంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ముక్కు, పెదాలు, పళ్లు ఈ భాగాల్లో ఏమైనా సమస్యలుంటే సర్జరీలు చేయించుకుంటున్నారు. వీటితోపాటు..చాలామంది అమ్మాయిలకు కామన్‌గా ఉండే సమస్య వక్షోజాల ఆకృతి.. ఇవి కొందరికి చిన్నవిగా ఉంటే..మరికొందరికి జారిపోయి ఇబ్బందికరంగా ఉంటాయి. సరైన షేప్‌లో ఉన్నప్పుడే వారి అప్పిరియన్స్‌ బాగుంటుంది.. వీటికోసం బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ సర్జరీలు చేయించుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు మంచిది..? ఎందుకు మహిళలు ఈరకం సర్జరీలు చేయించుకోవాల్సి వస్తుంది. వైద్యులు ఏమంటున్నారు..?
 హైదరాబాద్‌లో, ప్రతి నెలా కనీసం 25-30 బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సలు జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.. ఇది దశాబ్దం క్రితం 10 నుంచి 15 వరకు జరిగింది. ఎక్కువ మంది మహిళల్లో ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం పెరిగింది..దీంతో ఈ సంఖ్య ముందుముందు ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. రొమ్ము ఇంప్లాంట్ శస్త్రచికిత్సలను ఎంచుకునే వారు 20 నుంచి 30 ఏళ్లలోపు వారు ఉంటున్నారట.
వక్షోజాలు చిన్నగా ఉండటం చాలామందిలో ఆత్మన్యూనతకు కారణంగా కూడా ఉంటుంది. ఉద్యోగాలు చేసే మహిళలకు దీనిని ప్రధాన సమస్యగా భావిస్తారు. దీంతో 20 నుంచి 30 లోపు ఉన్న మహిళలు బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ సర్జరీల వైపు మెుగ్గుచూపుతున్నారు. వక్షోజాలు చిన్నగా ఉంటే తమ ఆకర్షణ తగ్గుతుందని మహిళలు అనుకోవడం సహజం..
కొంతమంది యువతులు పెళ్లి వయసు దగ్గరకు వస్తుంటే బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ వైపు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉద్యోగాలు చేసే యువతులు తమ శరీర కొలతల గురించి ఆందోళన చెందుతుంటారు. ఆకర్షణియంగా కనిపించాలనుకుంటారు. దీనిపై ఇంటర్నెట్లోనూ ఎక్కువగానే సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గత దశాబ్ద కాలంలో హైదరాబాద్లో బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

సర్జరీ ఎలా చేస్తారంటే..

వక్షోజాల పరిమాణం పెంచేందుకు వక్షోజ గ్రంధి లేదా ఛాతీ కండరాల కింద సిలికాన్ ఇంప్లాంట్లను ఉంచుతారు. వక్షోజాల మడతకు దిగువన కోత పెట్టి చేస్తుంటారు. ట్రాన్స్ యాక్సిలరీ విధానంతో మచ్చ కనపడదు. ఈ సర్జరీకి సుమారు రూ.2 లక్షల వరకు తీసుకుంటారట. అయితే ఈ సర్జరీ కోసం వచ్చే వారిలో రెండు రకాల వారు ఉంటారని వైద్యులు అంటున్నారు. వివాహానికి ముందు మంచిగా కనిపించాలని కొందరు వస్తుంటే.. మరికొంతమంది స్తీలు గర్భం దాల్చిన తర్వాత వస్తున్నారు. బిడ్డపుట్టాక..తల్లిపాలు ఇవ్వడం వల్ల మహిళల్లో వక్షోజాల ఆకృతి దెబ్బతింటుంది. ఈ క్రమంలో పెళ్లై పిల్లలు పుట్టాక కూడా ఈ సర్జరీలు చేయించుకునేందుకు మహిళలు వెనకాడటం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version