తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ఖరారు అయిందట. మళ్లీ అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారట. జనవరిలో యూఎస్ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పయనం కానున్నారని సమాచారం అందుతోంది. ఐదు నెలల కిందటే అమెరికాకు వెళ్లి వచ్చిన రేవంత్ రెడ్డి.. జనవరిలో యూఎస్ పర్యటనకు సిద్ధం అవుతున్నారట.
పెట్టుబడుల కోసం మరోసారి యూఎస్ వెళ్తారని సమాచారం అందుతోంది. దీంతో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక నేడు మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఇవాళ, రేపు.. రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 10 గంటలకు నాగ్‌పూర్‌కు చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కణ్నుంచి చంద్రాపూర్ లో అక్కడి నేతలతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి.