వైరల్ వీడియో; కిరణ్ బేడిపై నెటిజన్లు సీరియస్…!

-

అంటే అన్నారు అంటారు గాని, భారతీయులకు ఎవడైనా ఏదైనా చెప్తే మాత్రం దానిని యిట్టె నమ్మేస్తారు. సంస్కృతం మాట్లాడితే షుగర్ రాదని ఎవరో చెప్తే నిజమే అనుకున్నారు. ఏదైనా దేవాలయాల గురించి సమాచారం వచ్చినా, ఏదైనా విషయాల గురించి ఎవరైనా అనవసర విషయాన్ని ఆసక్తికరంగా పోస్ట్ చేసినా సరే మన జనానికి అదేదో పెద్ద వింతగాను, మన దేశం గొప్పగాను కనపడుతూ ఉంటుంది.

దీనిని క్యాష్ చేసుకునే కార్యక్రమాలు కూడా కొందరు చేస్తూ ఉంటారు. అందుకే మన దేశంలో స్వామీజీలకు కొదవ లేదు. తాజాగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, రిటైర్డ్ ఐపియస్ అధికారి, సోషల్ యాక్టివిస్ట్, కిరణ్ బేడీకి తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసారు. సూర్యుడి నుంచీ ఓం అనే శబ్దం వస్తుండటాన్ని నాసా (అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ) రికార్డ్ చేసిన వీడియో కాప్షన్ పెట్టి పోస్ట్ చేసారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవానికి ఈ వీడియో ఇప్పటిది కాదు. ఎప్పటిదో, ఈ వీడియోని పోస్ట్ చేసినందుకు గాను నెటిజన్లు కిరణ్ బేడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే నాసా ఇదే అంశానికి సంబంధించి ఇదివరకే యూట్యూబ్‌లో రియల్ వీడియోని అందులో సూర్యుడి నుంచీ వచ్చే శబ్దాలు వినిపిస్తున్నాయి. అవి భారీ గాలి మాదిరిగా, మంట శబ్దాల్లా వినిపిస్తున్నాయి. మొత్తం 40 రోజులు రికార్డ్ చేసి… ఈ ధ్వనులను నాసా సేకరించింది. ఆ వీడియో కాస్త అతి బ్యాచ్ ఓం అని జోడించింది. https://twitter.com/thekiranbedi/status/1213289349942370304

Read more RELATED
Recommended to you

Exit mobile version