ఏ రాయి అయితేనేం పళ్ళు రాలకొట్టుకోవడానికి: కన్నాసెటైరిక‌ల్ ట్విట్‌

-

ఏపీలో రాజధాని రగడ చల్లారడం లేదు. ఓ వైపు అమరావతి రైతులు ఆందోళనలు కొనసాగిస్తుంటే… మరోవైపు ప్రతిపక్ష పార్టీలు సైతం తమ వ్యాఖ్యలతో రాజధాని వేడిని మరింత రాజేస్తున్నాయి. ఇక ఇప్పటికే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రాజధాని అంశంపై ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై ప్రతిపక్ష టీడీపీ భగ్గుమంటుంటే.. బీజేపీ తరపున రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తనదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందించారు.

‘ఏ రాయి ఐతేనేమి పళ్ళు రాలకొట్టుకోడానికి..?. సమయాన్ని, ప్రజధనాన్ని వృధా చేస్తూ మొన్న G.N రావు కమిటీ, నిన్న బోస్టన్ కమిటీ, రేపు హైపవర్ కమిటీ.. పేరు ఏదయినా సీఎం మనసులో ఉన్న ఆలోచననే నివేదికగా ఇచ్చి ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని ప్రజలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నారు’ అని ట్విట్టర్‌లో కన్నా రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version