ఏదైనా ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ కి వెళ్లడానికి అంబులెన్స్ ని ఉపయోగిస్తూ ఉంటాం. అంబులెన్స్ ఎమెర్జెన్సీలో ఉన్న వాళ్ళకి ప్రాణం పోస్తుంది. ఏదైనా యాక్సిడెంట్ అయినా లేదంటే ఇంకేమైనా ప్రమాదాలు పొంచుకొచ్చినా అంబులెన్స్ లో సురక్షితంగా ఆసుపత్రికి చేరుస్తారు. 108 కి డయల్ చేసి చెప్తే చాలు అంబులెన్స్ మనల్ని ఎక్కించుకుని వెళ్తుంది. అయితే చాలా అంకెలు ఉన్నాయి కదా..? అంబులెన్స్ మీద 108 అని ఎందుకు రాసి ఉంటుంది..? దాని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
108 అనే నెంబర్ ని ఫిక్స్ చేయడానికి చాలా అర్థాలు ఉన్నాయి. హిందూ సంప్రదాయంలో 108 అనే నెంబర్ కి ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా 108 అనే నెంబర్ కి ప్రత్యేకత ఉంది. 108 పత్రాలతో పూజ చేయడం.. జపమాలలో 108 రుద్రాక్షలు లేదా పూసలు ఉండడం.. ఇలా ఎన్నో ఉన్నాయి.
108 ని కూడితే 9 వస్తుంది. ఏ సంఖ్యనైనా తొమ్మిది సార్లు హెచ్చించి కూడినా తొమ్మిది వస్తుంది. తొమ్మిది గ్రహాలు మనకు ఉన్నాయి. పైగా పాలసముద్రాన్ని మదించినప్పుడు 108 మంది ఆదిశేషునికి ఇరువైపులా ఉండడం.. అష్టోత్తరం అంటే 108 మంత్రాలు.. ఇలా ఈ సంఖ్యకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సైకాలజీ ప్రకారం 108 కి ప్రత్యేకత ఉంది. నిరాశ, డిప్రెషన్ ఉన్నట్లయితే చూపు ఫోన్లోనే ఎడమవైపు చివరికి వెళ్తుంది. 08 దగ్గరగా ఉండడం వలన 108 ని ఎమర్జెన్సీ నెంబర్ గా ఎంచుకున్నారు.