హైదరాబాద్‌లో డబులు డెక్కర్‌ బస్సులను ఎందుకు నిలిపేశారు..? 

-

కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు ఉండేవి. ఇప్పటి వాళ్లకు తెలియదు కానీ బాగా పాతకాలం నాటి వారికి మాత్రం ఈ బస్సులు తెలుసు.. ఒక బస్సు పైన ఇంకో బస్సు ఎలా ఉండేది. .అసలు ఆ బరువును ఎలా మోసేది. కాలక్రమేణా ఈ బస్సులు కనుమరుగైపోయాయి.. ఇప్పుడు అదే బస్సులను హంగులు మార్చి తీసుకొస్తున్నారు. డబుల్‌ డెక్కర్‌ బస్‌ ఎక్కడం అంటే ఇప్పటికీ ఉత్సుహకతే..! పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు ఇదొక మంచి ప్రయత్నం అనే చెప్పాలి.
హైదరాబాద్‌లో డబల్ డెక్కర్ బస్సులను తిరిగి ప్రారంభించాల్సిందిగా గత సంవత్సరం ఒక నెటిజన్ కోరగా, దీనికి కేటీఆర్ స్పందించి రవాణా శాఖ మంత్రిని ఈ విషయంపై ఆలోచించవలసిందిగా కోరారు. హైదరాబాద్‌లో మళ్లీ డబల్ డెక్కర్ బస్సులు రాబోతున్నాయి అనే వార్త మొదలైంది. అసలు డబల్ డెక్కర్ బస్సులను ఆపివేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సిటీలు చాలా అభివృద్ధి చెందాయి. ఎల్లప్పుడు రోడ్లు చాలా బిజీగా ఉంటాయి. డబల్ డెక్కర్ బస్సులు చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా డ్రైవ్ చేస్తారు. దీని వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలాగే యావరేజ్ ట్రాఫిక్ స్పీడ్ మీద కూడా ప్రభావం పడుతుంది.
నగర ఆర్టీసీకి చెందిన డబల్ డెక్కర్ బస్సులను అశోక్ లేలాండ్ తయారు చేసేవారు. పాలసీలో మార్పుల కారణంగా, 1990ల మొదట్లో డబుల్ డెక్కర్ బస్సులను ఉత్పత్తి చేయడం ఆపేశారు. అంతే కాకుండా స్పేర్ పార్ట్స్ ఉత్పత్తి కూడా నిలిపివేశారు.
దాదాపు అన్ని డబుల్ డెక్కర్ బస్సులు 25 సంవత్సరాలకు పైగా నడిచాయి. ప్రతి డబుల్ డెక్కర్‌కు ఇద్దరు టికెట్ కలెక్టర్లు ఉండేవారట. సర్వీసింగ్ కోసం అదనపు స్టాఫ్ అవసరం ఉండే వాళ్ళు. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉండేవట.
2003-2004లో ఆర్టీసీ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ సమయంలో డబల్ డెక్కర్ బస్సులు కొనడం కొంచెం ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది.
కొంత కాలం తర్వాత డబల్ డెక్కర్ బస్సులకు చాలా ప్రమాదాలు జరిగాయి. రోడ్డు మలుపులు వచ్చినప్పుడు బస్సుని తిప్పడం కష్టంగా ఉండేది. జనాభా కూడా చాలా పెరిగింది. దాని వల్ల బయటికి వచ్చే వాళ్ల సంఖ్య పెరిగింది. ప్రమాదాలను నివారించడం అనేది కూడా డబల్ డెక్కర్ బస్సులను ఆపడానికి ఒక కారణం.
టెక్నాలజీ పెరుగుతుండటంతో టెలిఫోన్ కనెక్షన్లు, అలాగే జనాభా కూడా ఎక్కువవడంతో ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఎక్కువ అయ్యాయి. డబల్ డెక్కర్ బస్సు ఎత్తుగా ఉంటుంది కాబట్టి వెళ్తున్నప్పుడు వైర్లు తగిలే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు ప్రవేశపెట్టారు. అవి చాలా ఆధునికంగా ఉన్నాయి. ముఖ్యంగా ట్యాంక్ బండ్ దగ్గర ఈ డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కువగా తిరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version