సీఎం రేవంత్ ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్ వేయాలని అధికారులను ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇసుక అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారని హెచ్చరికలు జారీ చేశారు. ఇక అటు తెలంగాణ మందుబాబులకు రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో బీర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎండా కాలం వచ్చిన తరుణంలోనే తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బీర్ల ధరలను 15 శాతం పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.