పార్లమెంట్ లోని సభ్యులు హెడ్ ఫోన్స్ ని ఎందుకు పెట్టుకుంటారు..? రీజన్ ఇదే..!

-

ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే పార్లమెంట్ లో ఉండే సభ్యులు హెడ్ ఫోన్స్ ని ధరిస్తారు ఎప్పుడైనా ఎందుకు వాళ్ళు హెడ్ ఫోన్స్ ని పెట్టుకుంటారు అనే సందేహం మీకు కలిగిందా..? పార్లమెంట్ లో సభ్యులు హెడ్ ఫోన్స్ ని పెట్టుకోవడం వెనుక పలు కారణాలు ఉన్నాయి వాటిని ఇప్పుడే తెలుసుకుందాం.
పార్లమెంట్లో వుండే ప్రతీ ఒక్కరికి అన్ని భాషలూ తెలీక పోవచ్చు.

వేరే భాషని మిగిలిన సభ్యులు మాట్లాడినట్లయితే ఆ భాష తెలియని వాళ్లు హెడ్ ఫోన్స్ ని పెట్టుకుని మరొక భాష లో దానిని వింటారు అంటే ఎవరైనా వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ భాష లోనే కాదు వేరు వేరు భాషల్లోకి కూడా ట్రాన్స్లేట్ చేయబడుతుంది. అందుకనే హెడ్ ఫోన్స్ ని పెట్టుకుని పార్లమెంట్ లో ఉండే వాళ్ళు వింటూ ఉంటారు.

ఏకకాలంలోనే సభ్యుడు మాట్లాడే భాష వేరు వేరు భాషల్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది ఎవరైనా హిందీ లో మాట్లాడితే అది ఇంగ్లీష్ ఇతర భాషల్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది దాంతో భాష వలన ఎవరికి సమస్య రాదు. నచ్చిన భాషలో వినొచ్చు. అలానే పార్లమెంట్లో గందరగోళంగా ఉంటుంది అలా కాకుండా క్లియర్ గా వాయిస్ ఉండాలంటే హెడ్ ఫోన్స్ ని పెట్టుకుంటారు అప్పుడు క్లియర్ గా అన్నీ వినపడతాయి. ఒక్కోసారి వాయిస్ అడిబుల్ గా ఉండకపోవచ్చు. ఇలాంటి ఇబ్బందులు కూడా రాకుండా హెడ్ ఫోన్స్ ని ఉపయోగిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version