ప్రస్తుత సమాజంలో యూట్యూబ్ తెలియని వారుండరూ. చాలా మంది సెలబ్రిటీలు, టెక్నిషియన్లు, ఎడ్యుకేటర్లు తమ క్లాసుల ద్వారా పాపులర్ అయ్యారు. కోట్లల్లో వ్యూస్ దక్కించుకుని సెలబ్రిటీలుగా మారారు. వీడియోల రూపంలో మీకు నచ్చిన ప్రతి అంశాన్ని యూట్యూబ్ లో సర్చ్ చేసుకుని చూసుకోవచ్చు. అన్ని రకాల ఎంటర్ టైన్ మెంట్ తో పాటు విజ్ఞానాన్ని పెంపొందిచ్చుకోవచ్చు. అయితే వినోదంతోపాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని భావించే వాళ్లు ఈ కింది ఛానళ్లపై ఓ లుక్కేయండి.
ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే ‘హౌ స్టఫ్ వర్క్స్’ యూట్యాబ్ ఛానల్ ను చూడొచ్చు. ఇందులో కాంటాక్ట్ ట్రేసింగ్ అసలెలా పని చేస్తుంది.. ఇప్పటి వరకు అసలు పరిష్కారమే లేని రహస్యాలేంటి.. మనుషులు చనిపోయే ముందు ఏం జరుగుతుంది.. నిజంగా దెయ్యాల బంగ్లాలున్నాయా వంటి ఆసక్తికర విషయాలను అర్థమయ్యే రీతిలో వివరించడం ఈ ఛానల్ ప్రత్యేకత. 1998లో చిన్న వెబ్ సైట్ గా ఏర్పడిన ఈ ఛానల్ ప్రస్తుతం అవార్డ్ విన్నింగ్ ఛానల్ గా అవతరించింది. వింతలు, విశేషాలు, సైన్స్, చరిత్ర ఈ ఛానల్ ప్రత్యేకం.
What if..
ప్రపంచంలోని వింతలను కళ్లకు కనిపించేలా ఈ ఛానల్ అందిస్తోంది. సాధారణంగా అందరికీ కలలు రావడం సహజం. కలలో మనకంటూ ఓ ఊహా ప్రపంచాన్ని సృష్టించుకుంటాం. కానీ మీ ఊహలకు సమాధానాలు కావాలంటే.. మీ ఊహా ప్రశ్నలకు ఈ ఛానల్ సమాధానం ఇస్తుంది. లేని ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేస్తుంది.
the Infographics show..
గ్రాఫిక్ లతో వీడియో అందరిని ఆకట్టుకునేలా చూపడమే ఈ ఛానల్ ప్రత్యేకత. విశ్వంలో అసలు ఏలియన్స్ ఉన్నాయా.. బ్లాక్ హోల్ అంటే ఏంటీ.. నిద్రలేకపోతే ఏమవుతుంది.. వంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ ఛానల్ అందిస్తోంది. వర్తమాన వ్యవహారాలు, చారిత్రక ముఖ్య సంఘటనలు, ఆరోగ్య వాస్తవాలు, ప్రముఖ స్థలాలు, నవ్వించే విషయాలు, చరిత్రలో అత్యంత క్రూరమైన వ్యక్తుల గురించి ఈ ఛానల్ తెలుపుతుంది. వీటితో పాటు వీడియో గేమ్ ల కోసం vsauce, ఫిజిక్స్ సంబంధించిన అంశాల కోసం minutephysics, వ్యాపారం, ఆర్థిక శాస్త్రం, జీవశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, చరిత్ర, సాహిత్యం, పురాణాలు, గణాంకాలలను crash course ఛానళ్ల ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు.