భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?

-

భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా మంది అబ్బాయిలు మాత్రం పెళ్లి తర్వాత తమ జీవితం మొత్తం తమ భార్య కంట్రోల్ లోకి వెళ్లిపోయిందని తెగ ఫీల్ అవుతూ ఉంటారు. భార్యకు ఏం కొనిపెట్టిన చాలా అసంతృప్తిగానే ఉంటారని తనకు ఏం కావాలో మాకు తెలియడం లేదు అంటూ సమాధానాలు చెబుతుంటారు అయితే ఒక భార్య భర్త నుంచి ఎప్పుడూ కూడా ఏం కోరుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

తన భర్త తన పట్ల కాస్త శ్రద్ధ చూపించాలి అని ఆశపడుతుంది.ఆమె పట్ల మీరు ప్రేమ ఆప్యాయత చూపించాలని కోరుకుంటుంది మీరు గోరంత ప్రేమ చూపిస్తే ఆమె మీకు తిరిగి కొండంత ప్రేమను పంచుతుంది.ఇక భార్యాభర్తల విషయంలోనే కాదు ఏ సంబంధంలోనైనా కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం.. భర్త చెప్పాలనుకున్నది అర్థమయ్యేలా చెప్పాలి. అదేవిధంగా ఆమె చెప్పేది కూడా అంతే సహనంతో వినాలి ఇలా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది తప్పనిసరి.. అప్పుడే బంధం బాగుంటుంది..

కొన్ని విషయాలలో మీ భార్య మీరు తనకు మద్దతుగా నిలబడాలని ఆశపడుతుంది. ఇలా అవసరమైనప్పుడు మీరు ఆమెకు కాస్త ప్రోత్సాహాన్ని మద్దతును తెలియజేయడం అవసరం.. అంతేకాదు..భార్య ఎప్పుడూ మీ నుంచి గౌరవాన్ని ఆశిస్తుంది నలుగురిలో ఉన్నప్పుడు మీరు తన పట్ల హేళనగా మాట్లాడకుండా కాస్త గౌరవంగా మాట్లాడాలని కోరుకుంటుంది.. నలుగురు ఆమె విషయాలకు నవ్వుకున్నారని బాధపడుతుంది.. తనకు విలువైన వస్తువులు ఇవ్వకున్నా కూడా కనీసం అందరి ముందు మర్యాద ఇస్తే చాలు అని కోరుకుంటుంది.. తన శరీరం గురించి కూడా నలుగురిలో చాలా ఫీల్ అవుతుంది.. ఇలాంటివి పొరపాటున కూడా చెయ్యకండి.. తన సర్వస్వం మీరే అనుకుంటుంది అనే విషయాన్ని మర్చిపోకండి.. అమ్మానాన్నలను వదిలి మీతో వస్తుంది.. ప్రేమించండి.. అది మన ప్రాపర్టి కదా..

Read more RELATED
Recommended to you

Exit mobile version