మగాళ్లను ఎలా బుట్టలో వేసుకోవాలంటే?

-

మగాల్లను బుట్టలో వేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు..ఒక్క నవ్వు,ఓర చూపు చూస్తె చాలు అని చాలా మంది కవులు చెప్తూనే ఉంటారు..కానీ అందరు అబ్బాయిలు ఒకేలా ఉండరు. కొందరిని ఇంప్రెస్ చేయడం అంత ఈజీగా ఏమీ ఉండదు. కొంత శ్రమించాల్సిందే. మగాళ్లను సమ్మోహన పరచడం ఓ కళ. మరి ఆ కళలో మీకు మెలకువలు తెలియకపోతే ఇది చదివి తీరాల్సిందే..

ఒకరిని మొదటిసారి కలిసినప్పుడు, చాలా మంది వ్యక్తులు వారి రూపాన్ని చూసే ఒక అంచనాకు వస్తారు. మీరు ఒక వ్యక్తిని మోహింపజేయాలని ప్రయత్నిస్తుంటే, అతని దృష్టిని ఆకర్షించడానికి మంచి దుస్తులు ధరించండి. ఎంత మంచి డ్రెస్ వేసినా ఆత్మవిశ్వాసం లేకపోతే బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. కాబట్టి ఆత్మవిశ్వాసం అనే ఆభరణాన్ని తప్పనిసరిగా ధరించండి. మీకు చక్కగా సరిపోయే దుస్తులు, సౌకర్యవంతమైనవి వేసుకుంటే ఆత్మవిశ్వాసం వచ్చి చేరుతుంది..

మీలోని భావాలను బాడీ లాంగ్వేజ్‌ను ఉపయోగించి వ్యక్తీకరించండి. సందర్భం చూసి తాకడానికి ప్రయత్నించండి. వాళ్లంటే మీకు ఇష్టమన్న భావనను కలగజేస్తుంది. దొరికిన అవకాశాన్ని వదులుకోకండి..ఆత్మ విస్వాసాన్ని కలిగి ఉండాలి.ఇది చాలా ముఖ్యం అని గుర్తుంచుకోవాలి..కోరికలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. మీలోనూ, ఎదుటి వారిలోనూ ఉంటాయి. మీలో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో చెప్పడానికి ట్రై చేయండి. సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లోని సన్నివేశాల గురించి చర్చ మొదలు పెట్టండి. అలాంటివి మీకు చేయాలనిపిస్తుందని చెప్పండి..మగవారి హాట్‌స్పాట్స్ వద్ద సున్నితంగా మసాజ్ చేయండి.

ఎక్కడెక్కడో చూసి మాట్లాడటం మానుకోవాలి. కళ్లలో కళ్లు పెట్టి చూడాలి. ఇది కొందరికి చిన్నప్పటి నుండి వచ్చేస్తుంది. మరికొందరు మాత్రం నేర్చుకోవాల్సి ఉంటుంది. కళ్లలో కళ్లు పెట్టి చూసే వారి పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అది వారిలో మూడ్‌ను తీసుకువస్తుంది. మీరు కూడా ఫిజికల్‌గా కలవడానికి సిద్ధంగా ఉన్నారని మాటలతో కాకుండా చేతలతో చెప్పండి..ఇవన్నీ నిజమే కదా..మీరు ప్రయత్నించండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version