ఆస్తుల కంటే.. చదువు ఎంతో విలువైంది

-

త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌కు ఆస్తుల‌ను, అంత‌స్తుల‌ను ఇవ్వ‌డం కాద‌ని, చ‌దువును సంప‌ద‌గా ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం నిర్వహించిన జ్ఞానభేరి స‌ద‌స్సులో సీఎం మాట్లాడుతూ… తెలుగు ప్రజల భవిష్యత్ కోసం రెండు దశాబ్దాల క్రితమే ఐటీని ప్రోత్సహించానన్నారు.. నాటి ఫలితమే  ప్రపంచంలో ఐటీ రంగంలో ప్రతి నలుగురులో ఒక భారతీయుడు ఉంటే వారిలో  తెలుగు వారు ఉండటాన్ని గమనించాలన్నారు. ప్ర‌పంచానికి ఎక్కువ మంది ఐటి ప్రొఫెష‌న‌ల్స్‌ను అందించిన ఘ‌న‌త‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానిదేన‌న్నారు. కొఫీ అన్నన్ జ్ఞానం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పిన విషయాలను ఆయన గుర్తు చేశారు.

రాబోయే రోజుల్లో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలపాలన్నదే  నా ధ్యేయం అంటూ.. గ్రోత్ ఇంజిన్ గా 2013-14లో 7.16 శాతం, 2014-15 లో 8.39 శాతం, 2015-16 లో 10.95 శాతం, 2016-17 లో 11.61 శాతం, 2017-18 లో 11.72 శాతం వృద్ధి రేటు సాధించి దేశంలోనే అభివృద్ధిలో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ప్రధాని న‌రేంద్ర‌ మోడీ కంటే రాజకీయాల్లో  నేనే సీనియ‌ర్‌ని అంటూ చంద్రబాబు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version