ఈ సినిమాలు “ఎన్‌టీఆర్”కు ఇష్టం లేదా..?

-

గుర్తుందా… 2003లో నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన అలనాటి క్లాసిక్ రీమేక్ “నర్తనశాల” ..? నటరత్న నందమూరి తారకరామారావు అర్జునుడిగా, బృహన్నలగా అద్వితీయంగా నటించిన పౌరాణిక చిత్రం “నర్తనశాల” . స్వర్గీయ ఎన్‌టీరామారావుకు ఎంతో ఇష్టమైన ఈ సినిమాను బాలకృష్ణ రీమేక్ చేద్దామని గ్రాండ్‌గా షూటింగ్ కూడా స్టార్ట్ చేసాడు. తానే స్క్రీన్‌ప్లే, మాటలు, దర్సకత్వం వహిస్తూ, అర్జునుడిగా, బృహన్నలగా…. ఇంకా ఆనాడు స్వర్గీయ ఎస్వీ రంగారావు అద్భుతంగా పోషించిన కీచకుడి పాత్రలో కూడా తానే నటిద్దామని రంగంలోకి దిగాడు. రామోజి ఫిల్మ్ సిటీలో ఒక పర్ణశాల సెట్ వేసి పంచ పాండవులు, ద్రౌపదిపై ముహుర్తపు షాట్‌తో చిత్రీకరణ ప్రారంభమైంది. కొంత షూటింగ్ జరిగాక, దాన్ని ఆపేసిన బాలయ్య, “పల్నాటి బ్రహ్మనాయుడు” సినిమాతో బిజీ అయ్యాడు. 2004లో తిరిగి నర్తనశాలను పట్టాలెక్కిద్దామని రెడీ అయిన అయనకు భయంకరమైన షాక్ తగిలింది. సినిమాలో ద్రౌపది పాత్రలో నటిస్తున్న అగ్రనటి సౌందర్య విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైంది. అప్పటికే సౌందర్యతో కొంత భాగం చిత్రీకరణ పూర్తయ్యిఉండటంతో, ఆమె స్థానంలో ఎవరినీ ఊహించుకోలేక, చిత్రాన్ని కొనసాగించలేక బాబు దాన్ని అటకెక్కించేసాడు.
ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఎన్‌టీఅర్ జీవిత ఘట్టాలతో, తేజ డైరెక్షన్లో “ఎన్‌టీఅర్” సినిమాను మొదలుపెట్టాడు. మధ్యలో నేనీసినిమా చేయలేను బాబోయ్..అని తేజ తప్పుకున్నాడు. అప్పుడు మళ్లీ శాతకర్ణి తీసిన క్రిష్‌ని పెట్టి సగం పూర్తి చేసాడు కూడా.. సరిగ్గా ఈ సమయంలో ఇంకో దుర్ఘటన జరిగి సోదరుడు హరికృష్ణ దూరమయ్యాడు. ఇలా అసలు ఎందుకు జరుగుతోంది..? ఎన్‌టీఅర్ బయోపిక్ అని ఇంకో రెండు సినిమాలు షూటింగ్ మొదలుకాకుండానే ఆగిపోయాయి. మరి ఈ సినిమా అయినా పూర్తవుతుందా..లేదా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఎన్‌టీఅర్ పోషించిన పాత్రలలో నటిద్దామని బాలకృష్ణ అనుకున్న రెండుసార్లు ప్రమాదాలు జరిగి ఆప్తులు దూరమయ్యారు. తను అద్వితీయంగా నటించిన పాత్రలలో బాలయ్యను చూడటం దివంగత ఎన్‌టీఅర్‌కు ఇష్టం లేదేమోనని అభిమానులు, ఆంతరంగీకులు తీవ్ర చర్చల్లో మునిగిపోయారు. ఏదేమైనా కష్టాల కడలిని దాటి “ఎన్‌టీఅర్” బయటకొస్తే చూడాలని సగటు ఎన్‌టీఅర్ అభిమాని ఆశపడటంలో తప్పు లేదేమో..

Read more RELATED
Recommended to you

Exit mobile version