గూగుల్ ని అడిగిన నువ్వు 420 అని చెబుతోంది-అయ్యన్నపాత్రుడు

-

వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా తనకి ఒక మంచి సలహానిస్తున్నానని అయ్యన్నపాత్రుడు అన్నాడు .జగన్ నువ్వు ఎందుకు ఇన్ని వేల ఎకరాలు దోచేసుకుంటున్నావని ఎవరికైనా ఆరడుగుల భూమి ఉంటే సరిపోతుందని నువ్వు పొట్టోడివి కాబట్టి మూడు అడుగుల నేల నీకు చాలుతుందని అన్నారు. నీపై చాలా కేసులు ఉన్నట్టు సిబిఐ దగ్గర రిపోర్ట్ ఉందని అలాంటిది నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయించావు అని అన్నాడు.

 

అందుకే గూగుల్ ని అడిగిన నువ్వు 420 సీఎం అని చెబుతుందని కావాలంటే నువ్వు చెక్ చేసుకోవచ్చని సలహా ఇచ్చాడు.తుఫాన్ తో నష్టపోయిన బాధితులను అప్పుచేసి ఆదుకుంటామని చెప్పడం సిగ్గుచేటు అని అన్నాడు.40 గిరిజన గ్రామాలు మునిగిపోయాయని వారికి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా అని పర్యాటక శాఖ మంత్రి హోదాలో అక్కడి వెళ్లి గిరిజనులతో నృత్యం చేసిన రోజా దీనిపై ఎందుకు మాట్లాడడం లేదని పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికైనా జగన్ కి బుద్ధి రావాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నానని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version