గ్రాండ్ విక్టరీ తో ఆసియా కప్ ను స్టార్ట్ చేసిన శ్రీలంక !

-

ఆసియా కప్ లో భాగంగా నిన్న పల్లెకేలే మైదానంలో జరిగిన మ్యాచ్ లో ఆతిధ్య శ్రీలంక అయిదు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై ఘనవిజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోవడంతో, మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఆశించిన విధంగా సాగలేదు. ఓపెనర్లు నిరాశపరచడంతో మిగిలిన వాళ్ళు అందరూ కూడా అభిమానులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారు. వన్ డౌన్ లో వచ్చిన శాంటో మాత్రమే 89 పరుగులు చేసి జట్టుకు పరువును కాపాడే స్కోర్ 164 ను అందించాడు. బంగ్లాను శ్రీలంక యంగ్ బౌలర్ పతిరాణా నాలుగు వికెట్లు తీసి కుప్పకూల్చాడు. అనంతరం 165 పరుగుల లక్ష్యంతో ఛేదన ఆరంభించిన శ్రీలంక 39 ఓవర్ లలో అయిదు వికెట్లు కోల్పోయి సునాయాసంగా విజయాన్ని అందుకుంది.

కానీ మొదట్లో స్వల్ప స్కోర్ కె మూడు వికెట్లు కోల్పోయినా ఆ తర్వాత బంగ్లా పట్టు బిగించకపోవడంతో మ్యాచ్ శ్రీలంక చేతుల్లోకి వెళ్లిపోయింది. అలా శ్రీలంక తమ మొదటి మ్యాచ్ ను గ్రాండ్ విక్టరీ తో ఆసియా కప్ లో వేట మొదలు పెట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version