గత కొంతకాలముగా ఇండియాలో సంచలనం రేపిన స్కాం ఏదైనా ఉంది అంటే… అది ఢిల్లీ లిక్కర్ స్కాం అని చెప్పాలి. ఇందులో ప్రత్యక్షముగా మరియు పరోక్షముగా చాలా మంది రాజకీయ నాయకులకు ప్రమేయం ఉందని తెలిసిన విషయమే. కానీ విచారణలో భాగంగా సిబిఐ ఒక్కొక్కరిని విచారణ చేస్తూ అరెస్ట్ చేస్తోంది. రెండు రోజుల క్రితమే ఢిల్లీ సీఎం ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ను సిబిఐ విచారించింది. ఇక ఈ కేసులో మరొక్క వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ కి చెందిన అమన్ దీప్ సింగ్ ను సిబిఐ అరెస్ట్ చేసి రౌస్ అవెన్యూ కోర్ట్ లో ప్రవేశపెట్టింది. కాగా ఈ కేసును విచారించిన జడ్జి మూడు రోజుల పాటు ఇతన్ని కస్టడీ ఉంచాలని ఆదేశించింది.