ఢిల్లీ సీఎంగా అతిషీ ప్రమాణ స్వీకారం

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు సీఎం హోదాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని.. షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో కేజ్రీవాల్ సీఎం పదవీకి రాజీనామా చేశారు. దీంతో నూతన సీఎంగా అతిషీని ప్రకటించారు. ఇందుకు మంత్రి వర్గం, ఆప్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలిపారు. తాజాగా ఢిల్లీ నూతన మహిళా సీఎంగా అతిషీ ప్రమాణ స్వీకారం చేశారు. అతిషీతో ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా  ప్రమాణం చేయించారు.

అతిషీ ప్రమాణ స్వీకారానికి మాజీ సీఎం అరవింద్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, ఆప్ కీలక నేతలు హాజరయ్యారు.  సీఎంగా అతిషీతో పాటు మంత్రులుగా ఐదుగురు ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో సౌరవ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సెన్, ముఖేష్ అలావత్ ప్రమాణ స్వీకారం చేశారు. మార్చి 09, 2023న ఢిల్లీ ప్రభుత్వ మంత్రిగా ప్రమాణం చేసిన అతిషీకి విద్య, పబ్లిక్ వర్క్స్, రెవెన్యూ, వాటర్, ఫైనాన్స్, ప్లానింగ్ వంటి భారీ శాఖలను కేటాయించారు కేజ్రీవాల్. –

Read more RELATED
Recommended to you

Exit mobile version