ఉగ్రవాదుల స్వర్గధామంగా ఉండే పాకిస్థాన్ కే అక్కడ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు చుక్కలు చూపిస్తున్నారు. వరసగా దాడులు చేస్తూ పాక్ కు నిద్ర లేకుండా చేస్తున్నారు. తాజాగా ఆదేశ జాతిపిత ఖైద్-ఎ-ఆజామ్ మహ్మద్ ఆలీ జిన్నా విగ్రహాన్నే టార్గెట్ చేశారు. బలూచిస్థాన్లోని పోర్ట్ సిటీ అయిన గ్వాదర్ లోని జిన్నా విగ్రహాన్ని బాంబులతో కూల్చివేశారు. గత జూన్ లోనే అక్కడి ప్రభుత్వం విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. టూరిస్ట్ ముసుగులో వచ్చిన బెలూచ్ ఆర్మీ సభ్యుడే ఘాతుకానికి పాల్పడ్డాడని అక్కడి అధికారులు తెలుపుతున్నారు. జిన్నా విగ్రహంపై దాడి అంటే పాకిస్థాన్ ఐడలాజిపై జరిగిన దాడిగా అక్కడి రాజకీయ నేతలు అభివర్ణిస్తున్నారు.
పాక్ లో బాంబ్ బ్లాస్ట్.. ఆదేశ జాతిపితకే అవమానం
-