పోలవరం కాఫర్ డ్యాం నిర్మాణం కారణంగా నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోవడంతో మత్స్యకార కుటంబాలపై తీవ్ర ప్రభావం పడటంపై దాఖలైన వ్యాజ్యంపై మంగళవారం ట్రైబున్యల్ వాదనలు వినిపించింది. ఆయా ప్రాంతాల్లోని చాపల వేట ప్రధాన ఆదాయ వనరుగా జీవనం సాగిస్తున్న వారిపై డ్యాం నిర్మాణం ఎలాంటి ప్రభావం చూపుతుందనే నివేదికను కేంద్రీయ మత్స్యకార పరిశోధన సంస్థ…. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)ని సమర్పించింది. గతంలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని పలు మార్లు ట్రైబ్యునల్ ఆదేశించినప్పటికీ అనేక సాకులతో కాలయాపన చేస్తూ ..తుది నివేదికను అందజేసింది. దీనిపై పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంబంధిత ధర్మాసనం ఆదేశించింది.