కేటీఆర్ పైన పెట్టిన కేసు తూఫెల్ కేసు.. హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెట్టిన కేసు తూఫెల్ కేసు అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి తప్పు చేయలేదన్న ధైర్యం ఉంది కాబట్టి విచారణకి వెళ్తాం. కానీ హైకోర్టు చెప్పింది కేవలం విచారణ మాత్రమే చేయమని.. విచారణ ప్రారంభం కాకముందే తప్పు జరిగిందని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు.

కొంతమంది హైకోర్టు తీర్పును తప్పుడుగా వక్రీకరిస్తున్నారు. కేటీఆర్ కడిగిన ముత్యంల బయటకి వస్తారు. అక్రమ అరెస్టులకు మేము భయపడే వాళ్ళం కాదు.. సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల పైన చిచ్చరపిడుగుల్లా పోరాడిన చరిత్ర మాది. గతంలో అరెస్టై కేటీఆర్ వరంగల్ జైల్లో ఉన్నారు.  గ్రీన్ కో కి రూపాయి లబ్ధి చేయనప్పుడు వారు ఎందుకు మాకు తిరిగి డబ్బులు ఇస్తారు. అదే గ్రీన్ కో కంపెనీ ఫార్ములా అయ్యే నిర్వహణలో భారీగా నష్టపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వారి నుంచి డబ్బులు వచ్చాయనడం అర్థరహితం అన్నారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version