సీఎం రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్సీలు ప్రొ. కోదండరాం, అమీర్ అలీఖాన్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిద్దరూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం గవర్నర్ కోటాలో వారిద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రకటిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదించారు.కోదండరాం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఉద్యమం సమయంలో జేఏసీ చైర్మన్‌గా రాజకీయ పార్టీలను ఆయన ఏకతాటిపైకి తీసుకు వచ్చారు.కోదండరాంను విద్యాశాఖ మంత్రిగా నియమిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరు భేటీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇదిలా ఉంటే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా బీఆర్ఎస్ పార్టీ సత్యనారాయణ,దాసోజు శ్రవణ్ పేర్లను ప్రతిపాదించింది. కానీ వారికి ఎమ్మెల్సీ గా అర్హతలు లేవంటూ గవర్నర్ తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల పేర్లను పంపించింది.