తాజాగా తెలుస్తున్న అధికారిక సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం కమ్మని తీపి కబురు అందించింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రతి నెల మెడికల్ స్టూడెంట్స్ కు ఇస్తున్న స్టైఫండ్ ను 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. కాగా పెరిగిన స్టైఫండ్ వచ్చే జనవరి నుండి అమలులోకి రానుంది. అయితే ఈ స్టైఫండ్ ఎవరెవరికి వస్తుంది అన్న విషయం కూడా క్లారిటీ ఇచ్చారు. MBBS లేదా BDS హౌస్ సర్జన్ లతో పాటుగా పీజీ డిగ్రీ, పీజీ డిప్లమా, ఎండిఎస్, సూపర్ స్పెషలిటీ కోర్సులను చదివే వారికి ఇది వర్తిస్తుంది.
మెడికల్ స్టూడెంట్స్ స్టైఫండ్ ను 15 శాతం పెంచిన తెలంగాణ ప్రభుత్వం…
-