రుయా ఘటనపై కన్నెర్ర చేసిన పవన్.. ప్రభుత్వంపై ఫైర్

-

రుయాలో జరిగిన అమానవీయ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. రుయా దయనీయ ఘటనకు ప్రభుత్వమే కారణమన్నారు. తన బిడ్డ మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి నరసింహ పడిన కష్టం, వేదన దృశ్యాలు చూశానని, ప్రైవేటు అంబులెన్సు ఆపరేటర్లు డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వలేక.. చనిపోయిన తన బిడ్డను భుజంపై వేసుకొని బైక్ మీద వెళ్లిన ఆ ఘటన కలచి వేసిందన్నారు.

బిడ్డను కోల్పోయిన నరసింహ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పవన్.. ఈ ఘటనకు విధుల్లో ఉన్న ఓ వైద్యుణ్ణి సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొంటోందన్నారు. డ్యూటీలో ఉండే మెడికల్ ఆఫీసర్స్ వైద్యం చేయాలా? అంబులెన్సులు పురమాయించాలా? అని ప్రశ్నించారు. ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగం పటిష్టం చేయకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని, ఈ ఒక్క ఘటనే కాదు – రుయా ఆసుపత్రిలోనే కరోనా సమయంలో ఆక్సిజన్ లేకపోవడంతో 30 మంది మృత్యువు బారినపడ్డారని ఆయన ఆరోపించారు.

కడప రిమ్స్ లో కరెంట్ కోతల కారణంగా మరణాలు సంభవించాయని, వరుసగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. కన్నవారి కడుపు కోత అర్థం చేసుకోలేని స్థితికి ఆస్పత్రుల చుట్టూ ఉండే మాఫియాలు తయారయ్యాయని, వాటిపైనా, వారిని పెంచి పోషిస్తున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version