విశాఖలో ఇండియా-ఇంగ్లండ్‌ రెండో టెస్టు మ్యాచ్‌కు టికెట్ల విక్రయం షురూ….

-

విశాఖపట్నం  వైఎస్సార్‌ ఏసీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరుగనున్న ఇండియా, ఇంగ్లండ్‌ రెండో టెస్టుకు ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం నేటి నుంచి ప్రారంభమయ్యింది.ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు రెండో టెస్టు మ్యాచ్ జగనుంది.26 నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లను ఏసీఏ విడిసిఏ స్టేడియంతో పాటు స్వర్ణభారతి స్టేడియంలో విక్రయించ‌నున్నామని వెల్లడించారు.అంతేకాకుండా ప్రతి రోజు 2వేల మంది విద్యార్థుల‌కు మైదానంలోకి ఉచిత ప్రవేశం క‌ల్పించ‌నున్నామని  నిర్వాహకులు వెల్లడించారు. నాలుగేళ్ల తర్వాత విశాఖలో మ్యాచ్‌ జరగడంతో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ మ్యాచ్‌కు ఏర్పాట్లను ప్రారంభించింది.

మూడంచెల పటిష్ట భద్రతతో పాటు తాగునీరు, మెడికల్‌ సదుపాయాలు, తగినన్ని స్టాల్స్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు.  రూ.100, రూ. 200, రూ. 300, రూ.500 టికెట్లను ప్రతి రోజుకు విడివిడిగా విక్రయించనున్నారు. మొత్తం ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సీరిస్‌గాను తొలి టెస్టు ఈనెల 25 నుంచి 29 వరకు ఉప్పల్‌ స్టేడియం లో,మూడో టెస్టు ఫిబ్రవ‌రి 15 నుంచి 19 వ‌ర‌కు రాజ్‌కోట్‌లో, నాలుగో టెస్టు ఫిబ్రవ‌రి 23 నుంచి 27 వ‌ర‌కు రాంచీలో, ఐదో టెస్టు మార్చి 7 నుంచి 11 వ‌ర‌కు ధ‌ర్మశాల‌ స్టేడియంలో జరుగనున్నాయి .

Read more RELATED
Recommended to you

Exit mobile version