హార్దిక్ పాండ్య అభిమానులకి గుడ్ న్యూస్…..!

-

గత ప్రపంచ కప్ లో గాయంతో టోర్నికి హార్థిక్ పాండ్యా దూరమైన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో పాండ్య గాయ పడ్డారు. గాయం కారణంగా ఆశిస్ తో టి20 సిరీస్ కు ,దక్షిణాఫ్రికా పర్యటనకు ,ఆఫ్ఘనిస్తాన్ తో జరగిన టి20 సిరీస్ కు కూడా దూరమయ్యాడు.

ఇదిలా ఉండగా….తన అభిమానులకు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య అదిరిపోయే శుభవార్త అందించారు. వరల్డ్ కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ అతడు పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటికే కసరత్తులు ప్రారంభించిన పాండ్య తాజాగా బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గుజ‌రాత్ టైటాన్స్‌ నుంచి ఆల్ రౌండర్ పాండ్య‌ను ట్రేడింగ్‌లో తీసుకుని ముంబై జ‌ట్టుకు ఐదు సార్లు టైటిళ్ల‌ను అందించిన రోహిత్ శ‌ర్మ‌ను సారథ్య బాధ్య‌త‌ల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా రోహిత్ శర్మ స్థానంలో ముంబై టీం పగ్గాలు చేపట్టిన అతడు ఐపీఎల్ నుంచే రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version