ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందే టీమిండియాకు భారీ షాక్‌.. స్టార్‌ పేసర్‌ డౌటే..!

-

స్వదేశంలో మరో రెండు వారాలలో టీమిండియా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ లో తలపడనుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ కి స్టార్‌ పేసర్‌, వన్డే ప్రపంచ కప్‌లో ప్రత్యర్థులకు ముచ్చెమటాలు పట్టించిన మహ్మద్‌ షమీ.. ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం అనుమానమేనని వార్తలు వినిపిస్తున్నాయి. గాయం కారణంగా వన్డే ప్రపంచ కప్ తర్వాత షమీ ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.

ఫిట్నెస్ లేని సమస్యల కారణంగా ఇటీవల దక్షిణాఫ్రికా తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ లకి దూరం అయిన సంగతి తెలిసిందే. అతడు ఇంకా ఎన్సీఏ కి కూడా రిపోర్ట్ చేయలేదని తెలుస్తోంది. అతడు ఎన్సిఏ కి వెళ్లి తన ఫిట్నెస్ టెస్టును నిరూపించుకున్న తర్వాతే ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ మ్యాచ్ లకు ఎంపిక అవుతాడని బీసీసీఐ అధికారి తెలిపినట్లు సమాచారం. టీమిండియా ఇంగ్లాండ్ తో మొదటి టెస్ట్ ను జనవరి 25న ఆడనుంది. రెండో టెస్టు వైజాగ్ వేదికగా ఫిబ్రవరి 2న మొదలు కానుంది. ఇది ఇలా ఉంటే… వరల్డ్ టి20 నెంబర్ వన్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే టి20 సిరీస్ కి దూరమయ్యాడు. సూర్య ఐపీఎల్ వరకు గాయం నుంచి కోలుకుంటాడని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version