ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా.. ఒక్క డీఎస్సీ కూడా ఎందుకు వేయలేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.రాష్ట్రంలో సైకో(జగన్) ఉంటే.. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాయల వారు పరిపాలించిన నేల చంద్రగిరి అని, ఇదే గడ్డపై విజనరీ లీడర్ అయిన తాను జన్మించానని చెప్పారు.
తాను కాకుండా కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది ఈ జిల్లానే (చిత్తూరు) అని గుర్తు చేశారు. ”నన్ను జగన్ పదే పదే ముసలోడని అంటున్నారు.. డేట్, టైం ఫిక్స్ చేయ్.. తిరుమల కొండకి నేను, నువ్వు కాలినడకన వెళ్దాం. ఎవరూ తర్వగా కొండపైకి వెళ్తారో చూద్దాం. అప్పుడు ముసలోడు ఎవరో ప్రజలు నిర్ణయిస్తారు” అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ కు సవాల్ విసిరారు.జగన్ పాలనలోనూ రాష్ట్రం నెంబర్ 1గా ఉంది.. కానీ అభివృద్ధిలో కాకుండా గంజాయి, డ్రగ్స్, ప్రమాదకరమైన మద్యం విక్రయాల్లో నెంబర్ 1గా ఉందని ఎద్దేవ చేశారు.