ఇష్టపూర్వక శృంగారం నేరం కాదు…సుప్రీం కోర్టు

-

ఐపీసీ సెక్షన్‌ 497 కాలం చెల్లిన చట్టంగా పేర్కొన్న సుప్రీం

ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని  సుప్రీం కోర్టు సంచలన తీర్పుని వెలువరించింది. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్‌ 497 చట్టం రాజ్యాంగానికి అనుకూలంగా లేదని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. వివాహేతర సంబంధాల చట్టంలోని పలు నిబంధనలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిపి తీర్పుని వెలువరించింది..

ఈ సందర్భంగా ..  సెక్షన్‌ 497 కాలం చెల్లిన చట్టంగా పేర్కొంది. మహిళలకు సమానహక్కులు కల్పించాలన్న స్ఫూర్తికి సెక్షన్‌ 497 తూట్లు పడుతున్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. దేశంలో జరుగుతున్న అనేక పరిణామాలు, కేసులను దృష్టిలోకి తీసుకున్న కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. మహిళ ఎవరితో గడపాలనే అంశం ఎవరికి చెందింది కాదు..అది వారి ఇష్టానికి సంబంధించింది అంటూ కోర్టు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version