ఎన్నిక‌ల అధికారిని భాజ‌పా ఏమ‌ని వేడుకుందో తెలుసా?

-


తెలంగాణ‌లో తెరాస ప్ర‌భంజ‌నంతో 119 స్థానాల‌కు గాను భాజ‌పా ఒకే ఒక్క స్థానాన్ని కైవ‌సం చేసుకుంది. దీంతో చేసేదేమి లేక భాజ‌పా నేత‌లు ఎన్నిక‌ల అధికారిని క‌లిసి ఓ విన‌తి ప‌త్రం అంద‌జేశారు. అందులో తెలంగాణ ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈవీఎంలు, ఓటర్ల జాబితాలో అవకతవకల వల్లే తెరాస గెలిచిందంటూ కాంగ్రెస్, భాజ‌పాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే ఈ అంశంపై భాజ‌పా రెండుగులు ముందుకేసి మరోసారి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయడం గమనార్హం.

ఈ మేరకు తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్‌ను కలిసిన బీజేపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, శాసమండలిలో బీజేపీ పక్షనేత రాంచందర్‌రావు‌లు గురువారం సీఈఓ రజత్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కన్నా లెక్కింపులో వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా 2014తో పోలిస్తే 2018నాటికి హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల్లో ఆరు చోట్ల ఓటర్లు తగ్గడం దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. భాజపా నేత‌ల వైఖ‌రిని చూసి సొంత పార్టీలో వారే వారిని ఈస‌డించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version