కారు కేవలం సర్వీసింగ్‌కు మాత్రమే వెళ్లిందని.. మళ్లీ రెట్టింపు వేగంతో దూసుకొస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. మోదీకి, రేవంత్ రెడ్డికి భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదనీ, ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణ ఏకైక గొంతుక బీఆర్ఎస్ ఆయన అన్నారు. పార్లమెంటులో తెలంగాణ సమస్య ల మీద పోరాడిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదే అని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ ,బీజేపీ కలిసి తెలంగాణ గొంతుక బీఆర్ఎస్‌ను ఫినిష్ చేసేందుకు చూస్తున్నాయన్నారు. ఇటీవల మోదీని రేవంత్ రెడ్డి, భట్టి కలిసినపుడు బీఆర్ఎస్‌ను ఫినిష్ చేసేందుకు పూర్తిగా సహకరిస్తాం అని ఆయన అన్నారట .బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదని, బీజేపీ, కాంగ్రెస్‌లు మాత్రమే ఒక్కటేనని స్పష్టంగా తెలియడం లేదా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
మల్కాజ్‌గిరిలో భారీ మెజారిటీ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు మల్లారెడ్డి, కడియం శ్రీహరి,వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్‌లు మధుసూధనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,మున్సిపల్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.