కొత్త స్పిన్నర్లకు ఈజీగా దాసోహమంటున్న టీమిండియా ప్లేయర్స్

-

ఇండియా – ఇంగ్లండ్‌ మధ్య హైదరాబాద్‌ ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇండియాకి ఘోర పరాభవం ఎదురు అయిన సంగతి తెలిసిందే. దాదాపు 5 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడిన ఇండియా జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంగ్లండ్‌తో ఉప్పల్‌లో ముగిసిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

టీమిండియా తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ స్పిన్నర్ హార్ట్ ఏడు వికెట్లు తీశారు. ప్రత్యర్థి టీమ్ లో కొత్త స్పిన్నర్ కు దాసోహమవడం మనోళ్లకు ఎప్పటి నుంచో అలవాటే. గత ఏడాది ఆస్ట్రేలియా స్పిన్నర్ టాడ్ ముర్ఫీకి 7 వికెట్లు, 2008లో స్వదేశంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ జాసన్ క్రెజాకు, కొలంబోలో శ్రీలంక స్పిన్నర్ మెండిస్కు చెరో 8 వికెట్లు, 2000లో ధాకాలో బంగ్లా స్పిన్నర్ నైమూర్ రహమాన్కు 6 వికెట్లు సమర్పించుకున్నారు.

ఇదిలా ఉంటే ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే రెండో టెస్టు విశాఖపట్నం వేదికగా డాక్టర్ వైఎస్సార్‌ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.ఫిబ్రవరి 2 నుంచి 6 వరకూ జరిగే రెండో టెస్టుకు కోసం ఇండియా సిద్ధమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version