తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ హీరో ధనుష్

-

కలియుగ దైవం తిరుమల శ్రీవారిని కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో ధనుష్ పాల్గొన్నారు.టీటీడీ ఆలయ అధికారులు హీరో ధనుష్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు ఇచ్చారు.

ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో కింగ్ నాగార్జున, తమిళ నటుడు ధనుష్‌ ప్రధాన పాత్రల్లో  ప్రతిష్టాత్మక మల్టీస్టారర్‌ సినిమా తెరకెక్కుతోంది . నిన్న ఈ చిత్రం షూటింగ్ కి సంబంధించిన అనుమతిని పోలీసులు రద్దు చేసిన విషయం తెలిసిందే.ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా నికేత్‌ బొమ్మి పనిచేస్తున్నారు.

అంతేకాకుండా ఇటీవలే ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా సంక్రాంతి కానుకగా తమిళంలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఇక తెలుగులో గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల అయిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version