మాల్దీవ్స్ అడ్వకేట్ జనరల్ హుస్సేన్ షమీమ్ పై కత్తులతో దాడి

-

ఇటీవల భారత్-మాల్దీవ్స్ వివాదం వేళ ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనాలో పర్యటించినలో భాగంగా ఆయన ‘మేము చిన్నవాళ్లమే కావొచ్చు. కానీ మమ్మల్ని బెదిరించే హక్కు ఎవరికీ లేదు’ అని మీడియా సమావేశంలో అన్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్‌ మయిజ్జుకు వ్యతిరేకంగా ఆ దేశ పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం తీసుకురావాలని విపక్షాలు సిద్ధమవుతుండటంతో ఆ దేశ పార్లమెంట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు మాల్దీవ్స్ అడ్వకేట్ జనరల్ హుస్సేన్ షమీమ్ పై కత్తులతో దాడి జరిగింది. రాజధాని మాలేలో జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ హుస్సేన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో అడ్వకేట్ జనరల్పై దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది.

 

రీసెంట్ గా లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీపై ఆ దేశ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version