తెలుగు రాష్ట్రాల్లో వర్షాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశం ఆలస్యమైంది. అయితే.. ఇప్పటికీ వర్షాలు మాత్రం విస్తారంగా కురియడం లేదు. అయితే.. తాజాగా చల్లని కబురు చెప్పింది వాతావారణ శాఖ. ఎట్టకేలకు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం బలపడి రానున్న రోజుల్లో అల్పపీడనంగా మారనుంది. జూలై 4 మధ్యాహ్నం నుంచి జూలై 7 వరకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా జూలై 4, 5 తేదీల్లో ఆంధ్ర జిల్లాలు .. బాపట్ల, ఎన్.టీ.ఆర్ (విజయవాడతో పాటుగా), కృష్ణా, ఏలూరు, కోనసీమ,ఉత్తర ప్రకాశం, పల్నాడు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలతో పాటుగా కర్నూలు,నంధ్యాల,అనకాపల్లి జిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీవర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.
మిగిలిన జిల్లాలు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మన్యం, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణశాఖ వెల్లడించింది. ఏపీలో ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు .. ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అటు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.తెలంగాణలో ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాలలో సగటు సముద్ర మట్టం నుండి 4.5 కిలో మీటర్ల నుండి 5.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈదురుగాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపారు.దీని ప్రభావంతో రేపటి(జులై4) నుంచి మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ పడే అవకాశం ఉంది ఐఎండీ తెలిపింది.
rain alert for telugu states