త్వరలోనే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నయా షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం……

-

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కైరా అద్వాని హీరోయిన్గా నటిస్తుంది. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న గేమ్ చేంజర్ చిత్రం ప్రస్తుతానికి షూటింగ్ దశలో ఉంది. పైగా ఈ సినిమాకి సంబంధించిన సమాచారం ఏదో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ హైదరాబాదులో ఆరంభం అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్, సముద్ర ఖని, ఎస్ జె సూర్య తదితర నటులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట .త్వరలోనే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ సెట్స్ లోకి జాయిన్ అవుతాడని సమాచారం.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ వెంకటేశ్వర క్రియేషన్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ మూవీకి కథను అందిస్తుండగా… ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version