దేవ‌ర’కు పోటీగా వ‌స్తున్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మూవీ ….

-

అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్స్ అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌  ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘బడే మియాన్‌ చోటే మియాన్‌’ . మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా హీరోయిన్లు గా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ  చిత్రం  నుంచి రిలీజ్ చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చింది.  తాజాగా ఈ చిత్రం  నుంచి మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్‌తో పాటు రిలీజ్ అప్‌డేట్ ఇచ్చారు.

 

ఈ మూవీనీ రంజాన్ కానుక‌గా ఏప్రిల్ 10న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు    ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను  చిత్ర యూనిట్  విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ గన్స్ పట్టుకోని ఫూల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజ‌ర్‌ను రిప‌బ్లిక్ కానుక‌గా జ‌న‌వ‌రి 24న విడుద‌ల చేయ‌నున్నారు. అయితే  రంజాన్ కానుక‌గా టాలీవుడ్ నుంచి మ‌రో పాన్ ఇండియా చిత్రం   విడుదల కానుంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం దేవర .  ఈ చిత్రం ఏప్రిల్ 05న విడుద‌ల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ నటిస్తుంది.దీంతో ఈ రెండు చిత్రాల మ‌ధ్య ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది

Read more RELATED
Recommended to you

Exit mobile version