ఇటీవల సీబీఐలో తలెత్తిన వివాదాల కారణంగా కేంద్ర ప్రభుత్వం సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం. నాగేశ్వరరావుని నియమించిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం నాగేశ్వరరావుకు కేంద్రం పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది. ఆయనను అదనపు డైరెక్టర్‌గా హోదాను పెంచుతూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. సీబీఐలో ఆలోక్ వర్మ, అస్థానా మధ్య ఆధిపత్య పోరుతో నేపథ్యంలో తెలుగు బిడ్డ అయిన మన్నెం నాగేశ్వరరావును అక్టోబర్ నెలాఖరులో సీబీఐ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా కేంద్రం నియమించారు.
1983లో ఓయూ నుంచి రసాయన శాస్త్రంలో పీజీ పట్టా అందుకున్న నాగేశ్వరరావు ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్‌డీ చేశారు. 1986లో సివిల్స్‌కు ఎంపికైన నాగేశ్వరరావు ఒడిశా క్యాడర్ అధికారి. సీబీఐ, ఆర్బీఐలపై కేంద్ర ప్రభుత్వం ఆధిపత్య పోరు పై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.