నితిన్‌ను లైన్ లో పెట్టిన పూరీ.. బేబ‌మ్మ‌కు ఛాన్స్‌

-

నితిన్ ఎప్పుడూ ఓ కొత్త త‌ర‌హాలో సినిమాలు చే‌సేందుకే ఇష్ట‌ప‌డ‌తాడు. ఇంత‌కు ముందు ఇలాగే అనేక ప్ర‌యోగాలు చేశాడు. మాస్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కూడా ఇదే కోవ‌లోకి వ‌స్తాడు. ఇప్ప‌టికే వీరిద్ద‌రూ హార్ట్ ఎటాక్ లాంటి సినిమా తీసి యూత్ లో ట్రెండ్ అయ్యారు. ఈ మూవీపై అప్ప‌ట్లో పెద్ద చ‌ర్చే జ‌రిగింది. ఎందుకంటే సాఫ్ట్ గా క‌నిపంచే నితిన్ ను మ‌రీ ఇంత ర‌ఫ్‌గా చూపించాడేంటి అని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయాడు.


ఇక ప్ర‌స్తుతానికి నితిన్‌ చేతిలో ‘మ్యాస్ట్రో’ ఒక్కటే సినిమా ఉంది. ఈ సినిమా తర్వాత మ‌న హీరో ఎవ‌రితో చేయబోతున్నాడు అనే సందేహానికి పులిస్టాప్ ప‌డింద‌నే చెప్పాలి. మాస్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్‌తోనే త‌ర్వాత సినిమా చేయ‌బోతున్నాడు అంటూ స‌మాచారం. ప్ర‌జెంట్ పూరి ‘లైగర్‌’ పనుల్లో బిజీగా ఉన్నాడు. కాగా ఈ మూవీ కూడా క‌రోనాతో వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ణంగా సినిమా షూటింగ్‌ రెగ్యులర్‌గా వాయిదా పడుతూ వస్తోంది. ముంబయిలో షూటింగ్‌ మొదలైనా.. అక్క‌డ కేసులు పెరగడంతో ‌షూటింగ్ వాయిదా వేశారు.
ఈ కార‌ణంగా డైరెక్ట‌ర్ పూరి హైదరాబాద్‌ వచ్చేశాడు. ఇదే క‌రెక్ట్ టైమ్ అని నితిన్‌కు ఓ కథ చెప్ప‌గానే.. నితిన్ కూడా ఓకే చెప్ప‌డాల‌ని స‌మాచారం. లైగ‌ర్ పూర్త‌వ్వ‌గానే దీన్ని ప‌ట్టాలెక్కిస్తార‌నితెలుస్తోంది. ఇక ఈ మూవీలో ‘ఉప్పెన’ బ్యూటీ బేబ‌మ్మ‌ను తీ‌సుకుంటార‌ని టాక్ న‌డుస్తోంది. ఇప్ప‌టికే కృతి శెట్టి చాలా బిజీ అయిపోయింది. ఇక ఈ కాంబో సెట్ అయితే అంచ‌నాలు వేరే రేంజ్ లో ఉంటాయ‌ని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version