మాస్కులు కొనేటప్పుడు, ధరించేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం…!

-

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది, ప్రభుత్వం నుంచి డాక్టర్ల వరకూ ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించాలని చెబుతున్నారు. కరోనా వైరస్ మాస్కులకి సంబంధించి తాజాగా రీసర్చ్ జరిగింది. సిడిసి మాస్కులు పెట్టుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు అవసరమని చెప్పడం జరిగింది. మాస్కులుని ధరించేటప్పుడు, కొనేటప్పుడు కూడా ఈ తప్పులు చేయొద్దు అని చెప్పడం జరిగింది.

మాస్క్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి..?

మాస్క్ ని కొనేటప్పుడు రెండు లేదా అంతకంటే ఎక్కువ లేయర్స్ ఉన్న వాటిని సెలక్ట్ చేసుకోవడం మంచిది.

అటువంటి మాస్క్ ని వేసుకున్నప్పుడు మీరు శ్వాస తీసుకోవడానికి ఎటువంటి సమస్య పడక్కర్లేదు.

దానిని మీరు ధరించేటప్పుడు మీ ముక్కు మరియు నోరు కూడా పూర్తిగా కవర్ అయ్యేలా చూసుకోండి.

ముఖం నోరు మరియు గడ్డం కూడా పూర్తిగా క్లోస్ అవ్వాలి. వదులుగా వేసుకోవద్దు. టైట్ గా ఉంచండి.

పిల్లలకి మాస్క్ ని కొనేటప్పుడు వాళ్లకి అది సరిపోతుందో లేదో గమనించండి.

మాస్క్ ని ధరించేటప్పుడు ఈ తప్పులు చెయ్యద్దు:

శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంది అని మాస్కులు ధరించడం మానేయండి మంచిది కాదు.

అలానే మాస్కు మీద వాల్వ్ లేదా వెంట్స్ ఉంటే వాటిని కొనద్దు. వాటివల్ల ప్రయోజనం లేదు.

గడ్డం ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి:

గడ్డం ఉండే వాళ్లు ముందు డిస్పోజబుల్ మాస్క్ వేసుకోండి. ఆ తర్వాత పైన మరో మాస్క్ ని ధరించండి. ఈ రెండవ మాస్క్ మొదటి మాస్క్ తాడు దగ్గర ఉండాలి.

ఎవరైతే వాళ్ళ యొక్క గడ్డం ట్రిమ్ చేసుకోరో వాళ్ళలో మాస్క్ లూస్ అయిపోతూ ఉంటుంది అటువంటి వాళ్ళు టైట్ గా ఉండేటట్టు చూసుకోవడం ముఖ్యం.

మాస్క్ వేసుకోవడానికి సరైన పద్ధతి ఇదే…!

ముందుగా మీ చేతులు శుభ్రంగా కడుక్కుని లేదంటే శానిటైజర్ చేసుకోవాలి. మీరు ధరించాక మీ చేతి తో మీ ముఖాన్ని తాగకండి. ఒకవేళ కనుక మీరు పదే పదే మీ మాస్క్ ని సర్దుకోవాలసి వస్తే ఆ మాస్క్ కి బదులుగా మరొకటి వేసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version