పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ లు నటించిన మల్టి స్టారర్ చిత్రం “బ్రో” సినిమా ఇటీవల విడుదలయి ఎలాగోలా
100 కోట్లను కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమాలో పృథ్వి చేత పబ్ లో వేయించిన డ్యాన్స్ నన్ను అనుకునే సృష్టించారు అంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ చేస్తూ తన ఆవేశాన్ని పవన్ పై వ్యక్తం చేశాడు. ఈ విషయం అటు అంబటి మరియు జనసేన నాయకుల మధ్యన వివాదాస్పద వ్యాఖ్యలతో నడుస్తూ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ నేను ఏమన్నా అంటే చంద్రబాబుకు ఎందుకు నొప్పి అంటూ ప్రశ్నించారు. నేను బ్రో సినిమా గురించి మాట్లాడితే చంద్రబాబు కు ఎందుకు కోపం అంటూ ఫైర్ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు. నన్ను పవన్ కళ్యాణ్ గోకాదు కాబట్టి నేను గోకుతున్నా మధ్యలో చంద్రబాబుకు ఏమిటి బాధ అంటూ రాంబాబు మాట్లాడారు.
పవన్ ను అంటే చంద్రబాబు కు ఎందుకు కోపం : అంబటి రాంబాబు
-