పెట్రోల్‌, డీజిల్‌కు పోటెత్తిన వాహనాలు.. హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌..!

-

ట్రక్కు డ్రైవర్ల ఆందోళనల నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత వస్తుందనే భయంతో పెట్రోల్‌, డీజిల్‌ కోసం ఒక్కసారిగా రోడ్లపైకి వేలాది వాహనాలు రావడంతో హైదరాబాద్‌ నగరంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో నగరంలోని పలు బంకుల ఎదుట నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఒక్కసారిగా వాహనాలన్నీ రోడ్డెక్కడంతో పలుచోట్ల వాహనాలు స్తంభించాయి.

మెహదీపట్నం – లక్డీకపూల్‌ మార్గంతో పాటు ఖైరతాబాద్‌ – లక్డీకపూల్‌ మార్గంలో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. పంజాగుట్ట – బేగంపేట మార్గంలోనూ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయినది .పంజాగుట్ట ఫ్లై ఓవర్ పై నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. కూకట్‌పల్లి,బంజారాహిల్స్ తో పాటు ఇతర మార్గాల్లోనూ భారీగా ట్రాఫిక్‌ జామ్ అయినది.

 

ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం హిట్‌ అండ్‌ రన్‌ కేసుల విషయంలో కొత్త నిబంధనలు అమలు చేయబోతున్న నేపథ్యంలో ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు.దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఆయిల్‌ ట్యాంకుల డ్రైవర్ల ధర్నాకి దిగటంతో బంకుల వద్ద ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో బంకుల ఎదుట నోస్టాక్ బోర్డులు కనిపించాయి.

Read more RELATED
Recommended to you

Latest news