ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మోడీని కలవడం రేవంత్ రెడ్డికి ఇదే తొలిసారి.ఈ సందర్భంగా విభజన ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, విభజన హామీల గురించి చర్చించినట్లు సమాచారం. అభివృద్ధి ప్రాజెక్టులు, వెనుకబడిన జిల్లాలకు నిధుల మంజూరుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తనవంతు సహకారం అందిస్తుందని ప్రధాని మోడి ఎక్స్ లో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెళ్లారు.